ప్రభాస్ సినిమా షూటింగ్.. ఘోర ప్రమాదం.. ఒకరి మృతి

  • ప్రభాస్ 'ఫౌజీ' సెట్స్ లో నెలకొన్న విషాదం
  • షూటింగ్ కు వెళ్తున్న యూనిట్ సభ్యుల కారుకు యాక్సిడెంట్
  • డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒకరి మృతి
  • మరో ఐదుగురికి తీవ్ర గాయాలు

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం నెలకొంది. ఈ ఉదయం షూటింగ్ నిమిత్తం వెళ్తున్న యూనిట్ సభ్యుల కారు హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.


సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న సమయంలో తమ సహచరుడు మరణించాడనే సమాచారంతో చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. మరోవైపు, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా యూనిట్‌లో ఈ ఘటన విషాద ఛాయలను నింపింది. మృతుడి కుటుంబానికి చిత్ర బృందం తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.


Prabhas
Fouji Movie
Hanu Raghavapudi
Movie Shooting Accident
Abdullapurmet
Hyderabad
War Drama
Tollywood News

More Telugu News